యువత జీవితానికి నాలుగు స్ఫూర్తి స్తంభాలు
అమ్మలా ప్రేమించండి… నాన్నలా బాధ్యత వహించండి… సైనికుడిలా శ్రమించండి… కలాంలా ఆలోచించండి!_. ✍🏼– శేరు పోశెట్టి
_మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి, ఎంతలా అంటే!_
మీ అమ్మ మిమ్మల్ని ప్రేమించినంతగా..._
మీరు పుట్టినప్పుడు మీ ముక్కును, ముడ్డిని శుభ్రంగా తుడిచి మిమ్మల్ని అందంగా తీర్చిదిద్ది మురిసిపోయినంతగా...
మీరు స్కూల్ కి వెళ్ళే రోజుల్లో మీ స్కూల్ యూనిఫామ్, బూట్లు, సాక్షులు శుభ్రంగా ఉతికి పెట్టీ, మీకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించి, లంచ్ బాక్స్ పెట్టీ పంపుతూ మురిసిపోయినంతగా...
మీరు అనారోగ్యానికి లోనైనప్పుడు మందులతో పాటు, మీకు వేడి, వేడి భోజనాన్ని అందిస్తూ, ముక్కోటి దేవతలను మొక్కుకుని మీ మంచిని కోరుకున్నంతగా...
మీరు పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె అలసటకు గురైనప్పటికీ, మీరు ఆమె మాటలకు అలిగి కోపంతో ముఖాలు ముడేసుకు కూర్చున్నప్పటికీ మీ బట్టలు ఉతుకుతూ, మీరు ఉపయోగించే Washroom, Bedroom and Study room లను శుభ్రపరుస్తూ, మీకు నచ్చిన వంటలు వండిపెడుతున్నంతగా...
మీ కడుపునింపడమే ఆమెకు పరమానందం,
మీ సంతోషమే ఆమెకు సంపూర్ణ బలం,
మీ ఆరోగ్యమే ఆమెకు శ్రీరామ రక్ష,
అందుకని మీ అమ్మ మిమ్మల్ని ప్రేమించినంతగా, మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి.
*_మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎంతలా అంటే!_*
*_మీ నాన్న మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నంతగా..._*
మీరు నడక నేర్చుకునే వయసులో కిందపడకుండా అడుగులు వేయడంలో నేర్పిన మెలకువలంతగా...
మీరు సైకిల్ తొక్కడం నేర్చుకుంటూ కిందపడిన ప్రతిసారి మీలో ధైర్యాన్ని నింపుతూ ప్రోత్సహించినంతగా...
మీ పాఠ్యపుస్తకాలకు పుట్టలు వేయడమే కాకుండా మీ Classwork, Home work మరియు చూచిరాత కాపీల ప్రతి పేజిని క్షుణ్ణంగా పరిశీలించి మీ తప్పులను సరిదిద్దినంతగా...
మీరు ఉన్నత చదువులకై ఇంటికి దూరంగా చదువుకునడానికి వెళ్ళినప్పుడు, మీ చదువును మాత్రమే కాకుండా మీ ఆరోగ్యంతో పాటు ఆటపాటల్లో మీ ప్రాతినిథ్యం, సంఘసేవ, సామాజిక స్పృహ పెంపొందించేందుకు విద్యాలయాల అధ్యాపకులతో నిత్యం చర్చిస్తూ సలహాలు సూచనలు పంచుకున్నంతగా...
మీరు పెరిగి ఉన్నత విద్యలు పూర్తి చేసుకున్నాక మీ జీవిత లక్ష్య సాధనలో మీకు దిశ నిర్దేశం చేయుటకై తను నిత్య విద్యార్థిలా శోధన చేస్తూ, పుస్తకాలు సేకరించి వాటి సమీక్షను వివరిస్తున్నంతగా...
సామాజిక విలువలు, సమైక్య స్ఫూర్తిని నింపుటకై తాను పడుతున్న తపనలాగా....
మీరు మీ జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు మీ నడవడిని, మీ దినచర్యను, మీ పనుల పట్ల, మీ ఆలోచనలపట్ల జాగ్రత్త వహించండి.
*_మీరు శాయశక్తులా కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోండి, ఎంతలా అంటే!_*
*_సియాచిన్ మంచు పర్వతాల్లో విధులు నిర్వహించే ఒక సైనికుడిలా..._*
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రాలలో ఒకటైన సియాచిన్ గ్లేసియర్‌లో, సముద్ర మట్టానికి సుమారు 20,000 అడుగుల ఎత్తులో, మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో సైతం దేశ సరిహద్దుల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికుడిలా...
తీవ్రమైన చలికి ఆహార పదార్థాలు గడ్డకట్టుకుపోయినా, తాగునీరు మంచుగా మారిపోయినా, తన విధి నిర్వహణకు అవసరమైన ప్రతి పనిని క్రమశిక్షణతో పూర్తి చేస్తున్నంతగా...
తగినంత ఆక్సిజన్ లేని వాతావరణంలో శ్వాస తీసుకోవడమే సవాలుగా మారినా, ఫ్రాస్ట్‌బైట్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నా, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధి నిర్వహణలో అంకితభావంతో కొనసాగుతున్నంతగా...
నెలల తరబడి కుటుంబానికి, బంధుమిత్రులకు దూరంగా, ఒంటరితనాన్ని, మానసిక ఒత్తిడిని భరిస్తూ, వ్యక్తిగత సంతోషాల కంటే దేశ భద్రతకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నంతగా...
మీరు కూడా మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, అపజయాలు, అవరోధాలను చూసి వెనకడుగు వేయకుండా, వాటిని అధిగమించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయండి. మీ లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్ధంగా శ్రమించండి. వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధికి ఉపయోగపడే పౌరులుగా ఎదగడానికి నిరంతరం ఒక సైనికుడిలా కష్టపడింది అలవాటు చేసుకోండి.
_మీరు సహనశీలురవ్వండి, ఎంతలా అంటే!_*
_APJ అబ్దుల్ కలాం అంతలా..._*
అబ్దుల్ కలాం జీవితంలో తనకు ఎదురైన సమస్యల పట్లగాని, జాతి ఎదుర్కొనే సమస్యల పట్లగాని ఏనాడు అసహనాన్ని వ్యక్తం చేయనంతగా...
కలాం గారు చూసిన, వారి దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కుంటూ ఉన్నతంగా ఎదిగి ఉత్తమ పౌరుడిగా గుర్తింపు పొందినంతగా...
చిన్న చిన్న విజయాలతో స్ఫూర్తిని పొందుతూ పెద్ద లక్ష్యాలను ఏర్పచుకున్నంతగా...
విజయంతో విశ్రాంతి పొందకుండా మరో విజయానికి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకు సాగినంతగా...
మీరు మీ జీవితంలో మీ సమస్యల పట్ల, మీ అసౌకర్యలపట్ల అసహనం వ్యక్తం చేయకుండా అసాధ్యమనే పనులను/లక్ష్యాలను సానుకూల దృక్పథంతో సాధన చేస్తూ సుసాధ్యం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతూ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉత్తములగా జీవించుటకు అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి.
మీరు కేవలం మీ కుటుంబానికి వారసులు మాత్రమే కాదు, దేశానికి స్వాతంత్ర్య సాధనలో జీవితాలను త్యాగం చేసిన వీరుల వారసులు మీరు, దేశాన్ని గొప్పగా నిర్మాణం చేసిన మహాత్ముల వారసులు మీరు, దేశ ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని పెంపొందిస్తూ, వైజ్ఞానిక భారత నిర్మాణంలో కృషి చేస్తున్న మేధావుల వారసులు మీరు. కావున మీపై మిమ్మల్ని కనిపెంచిన మీ తల్లిదండ్రులకంటే, మీకు విద్య బుద్దులు నేర్పిన మీ గురువులకంటే కూడా ఈ దేశం మీ మీద ఆధారపడుతుందనే విషయం ప్రతిక్షణం గుర్తెరిగి నడుచుకోండి.
దేశమంటే భారతదేశం - పౌరులంటే భారత పౌరులు అని ప్రపంచం గర్వించదగ్గ భారతీయ పౌరులుగా ఎదుగుతారని ఆకాంక్షిస్తూ...
*✍🏼- శేరు పోశెట్టి*
Telangana
యువత జీవితానికి నాలుగు స్ఫూర్తి స్తంభాలు
Quick Summary:
యువత జీవితానికి నాలుగు స్ఫూర్తి స్తంభాలు