మన్నెగూడలో చెస్ కప్–2026 పోటీలు
తొలి అక్షరం/ హైదరాబాద్, ఆగస్టు19
నైట్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 23న మన్నెగూడలో ఇండిపెండెన్స్ డే చెస్ కప్–2026 నిర్వహించనున్నారు. స్లోకా ఇంటర్నేషనల్ స్కూల్‌లో పోటీలు జరుగుతాయి. అండర్–8, 10, 13 విభాగాల్లో రేటింగ్ లేని క్రీడాకారులు పాల్గొనవచ్చు. ఐదు రౌండ్లలో పోటీలు నిర్వహించి, ఒక్కో రౌండ్‌కు 15 నిమిషాల సమయం కేటాయించారు. మూడు విభాగాల్లో టాప్–20 స్థానాల్లో నిలిచిన వారికి మొత్తం 60 బహుమతులు అందించనున్నారు. దరఖాస్తులకు ఈ నెల 21 చివరి తేదీ. చీఫ్ అర్బిటర్‌గా జ్యోతి గణేశ్ ఇనగంటి వ్యవహరించనున్నారు. వివరాలకు 8520818303ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
Sports
మన్నెగూడలో చెస్ కప్–2026 పోటీలు
Quick Summary:
మన్నెగూడలో చెస్ కప్–2026 పోటీలు