సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్
సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూ ముందుకు వెళుతుందని జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ కొనియాడారు.
బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ సిటిజన్లకు సైబర్ క్రైం మోసాలపై నిర్వహించిన అవగాహన సదస్సు అనంతరం స్థానిక సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు ఎస్పీ జానకి, ఐపిఎస్ గారిని ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు.
సమాజం పట్ల సీనియర్ సిటిజన్లకు అనేక కీలకమైన బాధ్యతలు ఉన్నాయని, తమ జీవితకాల అనుభవం, జ్ఞానంతో యువతరానికి సరైన విలువలను నేర్పడంలో ముఖ్యపాత్ర పోషిస్తూ సమాజంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించవచ్చని అన్నారు.
ముఖ్యంగా మైనర్లు గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాలని, అలాగే మైనర్లు డ్రైవింగ్ చేస్తూ అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు సరైన మార్గంలో ముందుకు సాగేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జగపతిరావు, ఉపాధ్యక్షుడు రాజసింహుడు, కె.వి. అశోక్, సూర్యనారాయణ, సురేష్ బాబు, లలితమ్మ, రియాజోద్ధీన్, పోకల శివుడు, రాములు, అబ్దుల్ మన్నాన్, బాలయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్
Quick Summary:
సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్
