తన ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మంజులాదేవి కృతజ్ఞతలు
మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగానికి సేవలందించడం సంతృప్తినిచ్చింది
జడ్చర్ల/నవోదయం : తన ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హాజరై, శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ జడ్చర్ల మండల విద్యాధికారి కె. మంజులాదేవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో ఎస్జీటీ, ఎస్ఏ, ప్రధానోపాధ్యాయురాలు, మండల విద్యాధికారిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశానని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల్లో మానవీయ, సామాజిక, నైతిక, ధార్మిక విలువలను పెంపొందించడంతోపాటు విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తూ జడ్చర్ల మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
తన ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వేలాది మంది హాజరై అభిమానం చూపడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, తన ఎదుగుదలకు తోడ్పడిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అన్ని వర్గాల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, సహచర ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల ఉపాధ్యాయులు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యంగా తనను పల్లకిలో కూర్చోబెట్టి భుజాలపై మోస్తూ జయజయధ్వానాలతో అభినందించిన పూర్వ విద్యార్థుల ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయని మంజులాదేవి పేర్కొన్నారు. తన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Telangana
తన ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మంజులాదేవి కృతజ్ఞతలు
Quick Summary:
తన ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మంజులాదేవి కృతజ్ఞతలు