Wed, Aug 19, 2026
YouTube
Rivx Studios
News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా
తాజా వార్తలు
స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ - Rivx Studios
Telangana

స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ

Published on August 19, 2026 at 3:00 AM

4,035 Views

News Image
Quick Summary:

స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ

స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ

పదవులు, హోదాలు ఉన్నప్పుడే సమాజసేవ చేయగలమనే భావనను చెరిపేస్తూ, ఒక సామాన్య పౌరుడిగా నిలబడి మార్పుకు నాంది పలికారు జరుపు భాస్కర్. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం లక్ష్మిపల్లికి చెందిన భాస్కర్, ప్రభుత్వం నుండి గానీ, ఇతర సంస్థల నుండి గానీ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం తన సొంత కష్టార్జితంతో పేదల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబాలు, అనాథలు, వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు పూయించడమే లక్ష్యంగా ఆయన జీవిత ప్రయాణం సాగుతోంది.

కష్టాల నుండి క్రమశిక్షణ వరకు
:
బాల్యం & విద్య

భాస్కర్ జీవితం పూలబాట ఏమీ కాదు. లక్ష్మీభాయి, దాక్యానాయక్ దంపతులకు జన్మించిన ఆయనకు ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నారు. ప్రాథమిక విద్యను మస్సిపూర్ లో పూర్తిచేసి, ఆపై జడ్చర్ల, బాలనగర్, నాగోల్ లోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు.
విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే కుటుంబ పరిస్థితుల వల్ల తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. వారం జీతం 300 రూపాయల కోసం గ్లూకోజ్ డబ్బాలు తయారు చేసే కంపెనీలో, జీప్ గ్యారేజీలో, స్వీట్ హోటల్లో మరియు రసాయన ఫ్యాక్టరీలలో కార్మికుడిగా పనిచేసి స్వీయ అనుభవంతో పేదరికాన్ని అర్థం చేసుకున్నారు. 2018 వరకు టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేసిన భాస్కర్, గత 8 ఏళ్లుగా తన సమయాన్ని, సంపాదనను పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు.

నమ్మిన సిద్ధాంతం & దాతృత్వం

"పుట్టుక, చావుల మధ్య నిజాయితీగా బతకాలనే కర్మ సిద్ధాంతాన్ని, సమాజం నుండి తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చేయాలనే దృక్పథాన్ని" గట్టిగా నమ్మే వ్యక్తి భాస్కర్. నాయకత్వం అంటే వెనుక నలుగురిని నడిపించడం కాదు, నలుగురి కష్టాలు తీర్చి వారి గుండెల్లో స్థానం సంపాదించడమే అని ఆయన బలంగా విశ్వసిస్తారు.

భాస్కర్ చేపట్టిన ప్రధాన సేవా కార్యక్రమాలు:
అత్యవసర వైద్య సహాయం


కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి 1.45 లక్షలు, అత్యవసర వైద్యం కోసం 1.65 లక్షలు, చిన్నారి ఆపరేషన్ కోసం 50 వేలతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఎందరో నిరుపేదలకు ఆర్థిక సాయం అందించారు.

విద్యా, పాఠశాలల అభివృద్ధి:

ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం 400 గజాల స్థలాన్ని దానం చేయడమే కాకుండా, విద్యార్థుల ఆటల ప్రాంగణం కోసం నాలుగు ఎకరాల భూమిని లీజుకు తీసుకుని అందించారు.
మౌలిక వసతులు & బాధితులకు ఆసరా: దేవునిగుట్ట తండాలో తాగునీటి సౌకర్యం, రామస్వామి గుట్టతండాకు బోర్ మోటారు ఏర్పాటు చేశారు. దారి అధ్వానంగా ఉన్న ప్రాంతాల్లో స్వయంగా రోడ్లు వేయించారు. నిరుపేదల వివాహాలకు తాళిబొట్టు, మెట్టెలు సమకూర్చడం, ఏ కుటుంబంలోనైనా ఆపద వచ్చి ఎవరైనా చనిపోతే ఆ బాధిత కుటుంబానికి 10,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించి ఓదారుస్తున్నారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక సేవ:

సింగం దొడ్డిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు, నర్సంపల్లి హనుమాన్ గుడి, పోచమ్మ గడ్డ తండా ఆలయ నిర్మాణాలకు విరాళాలు అందించారు.
భాస్కర్ ఆలోచనా విధానం & అభిరుచులు
రాజ్యాంగాన్ని, రామకృష్ణ పరమహంస బోధనలను అమితంగా గౌరవించే భాస్కర్, కులమతాలు మనుషులు నిర్మించుకున్న వ్యవస్థలని, మానవజాతి అంతా ఒకటేనని ప్రకటిస్తారు. అంటరానితనాన్ని అమానుషమైనదిగా ఖండిస్తారు. లవకుశ సినిమా, "ఓ బాటసారి" పాట, వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటలు, మిల్లెట్స్ భోజనం మరియు కామాఖ్య దేవస్థానం సందర్శన ఆయనకు ఎంతో ఇష్టం.

భవిష్యత్ ఆశయం & ప్రజా ప్రణాళిక

రాబోయే రోజుల్లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధిగా గెలిచి, పూర్తి సమయాన్ని (24/7) ప్రజల సేవకే అంకితం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ధనబలంతో కాకుండా ప్రజల ప్రేమాభిమానాలతోనే గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.
ఆయన భవిష్యత్ ప్రణాళికలు:
ప్రతి గ్రామానికి ఉచిత వైద్యం, గ్రంథాలయం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు.
ద్విచక్ర వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లు, భద్రత కోసం నాలుగు సిసి కెమెరాల ఏర్పాటు.
ఉపాధ్యాయుల ద్వారా నైపుణ్య శిక్షణ, అంబులెన్స్, ప్రాథమిక వైద్య సదుపాయాలు.
భూదందా, ఇసుక మాఫియా, గంజాయి మరియు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం.
పోలీసులకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వడం.
రైతు సంక్షేమం కోసం ప్రతి 30 రోజులకు ఒకసారి వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సులు.
ఇచ్చిన మాట తప్పితే రెండేళ్లకే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన జరుపు భాస్కర్, తన నిస్వార్థ సేవలతో నియోజకవర్గ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com